calender_icon.png 19 April, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ వెరిఫికేషన్

17-04-2025 08:51:01 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో నిజాంసాగర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో గతంలో యూడైస్ ప్లస్ లో నమోదు చేసిన వివరాలను పరిశీలించడానికి డైట్ కళాశాలకు చెందిన చాత్రోపాధ్యాయులను పరిశీలకులుగా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట కాంప్లెక్స్ పరిధిలోని మాగి ప్రాథమికోన్నత పాఠశాల, గోర్గల్ ప్రాథమిక పాఠశాలలలో గురువారం నాడు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పాఠశాల గదుల సంఖ్య, మరుగుదొడ్ల సంఖ్య, ఉపాధ్యాయులు పనిచేయుచున్న వారి వివరాలను సేకరించడం జరిగింది. వీటితో పాటు కిచెన్ గార్డెన్, తాగునీటి సదుపాయాలు, ఇంటర్నెట్ సదుపాయాలు కరెంట్ సదుపాయం స్మార్ట్ విద్యా బోధన తదితర అంశాల పైన వివరాలను సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఆర్పి బి.శ్రీధర్ కుమార్ ఛాత్రోపాధ్యాయురాలు మైక్ హున్నిసా, గోర్గల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయులు శివశంకర్, మాగి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సమీనా బేగం ఉపాధ్యాయులు భీమ్ రావు, ప్రవళిక, విగ్నేశ్వరి శైలజ తదితరులు పాల్గొన్నారు.