06-03-2025 11:27:19 PM
కొత్త కేసులు నమోదు చేయొద్దు : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కొత్త కేసులు నమోదు చేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉదయనిధి స్టాలిన్ 2023లో జరిగిన ఓ సభలో ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. హిందూ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఆయనపై బీహార్, జమ్మూకశ్మీర్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఇదే తరహాలో బిహార్‌లోనూ మరో కేసు నమోదైంది. పిటిషన్లపై గురువారం సీజేఐ సంజయ్‌ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ కేసులో గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.