calender_icon.png 29 September, 2024 | 9:52 AM

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

29-09-2024 01:37:41 AM

కుమారుడికి ప్రమోషన్ ఇచ్చిన సీఎం స్టాలిన్

చెన్నై, సెప్టెంబర్ 28: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇప్పటికే మంత్రిగా ఉన్న ఉదయనిధికి ప్రమోషన్ ఇస్తూ తన డిఫ్యూటీగా నియమించుకొన్నారు. శనివారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉదయనిధి ప్రస్తుతం క్రీడాశాఖను నిర్వహిస్తున్నారు.

డిఫ్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ప్రణాళికలు, అభివృద్ధి శాఖను కూడా ఆయనకు అప్పగించారు. తన క్యాబినెట్‌ను పునర్వవస్థీకరించిన సీఎం స్టాలిన్.. కొంతమంది శాఖలను మార్చారు. ఉదయనిధి మంత్రి పదవితోపాటు డీఎంకే యువజన విభాగం అధిపతిగా కూడా ఉన్నారు. ఈ పదవిలో స్టాలిన్ 40 ఏండ్లు కొనసాగారు. ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఉదయనిధి నంబర్ టూ స్థానానికి చేరుకొన్నట్టే.