calender_icon.png 19 April, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాదళ్ పట్టణ అధ్యక్షులుగా ఉదయ్

16-04-2025 04:32:43 PM

మందమర్రి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనుబంధ సేవా దళ్ పట్టణ అధ్యక్షులుగా దోత్కు ఉదయ్ కుమార్ ను నియమిస్తూ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దల జితేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుదవారం అందచేశారు. ఈ సందర్బంగా సేవాదళ్ పట్టణ అధ్యక్షులు ఉదయ్ మాట్లాడుతూ... చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎండి హఫీజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, మహిళ అధ్యక్షురాలు గడ్డం రజిని ఎస్సీ, సెల్ పట్టణ అధ్యక్షులు నేరువెట్ల, శ్రీను యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మాయ తిరుపతి, మైనార్టీ నాయకులు చోటులు పాల్గొన్నారు.