కోల్‌కతా, జనవరి 21: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ నికరలాభం 2024 అక్టోబర్‌డిసెంబర్ త్రైమాసికంలో 27.1 శాతం వృద్ధిచెంది రూ. 638 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో బ్యాంక్ రూ. 502 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది.
తాజాగా ముగిసిన క్యూ3లో యూకో బ్యాంక్ మొత్తం ఆదాయం 15.5 శాతం వృద్ధితో రూ.6,412 కోట్ల నుంచి రూ. 7,405 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ. 5,551 కోట్ల నుంచి రూ. 6,219 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 3.78 శాతం నుంచి 2.91 శాతానికి మెరుగుపడగా, ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పీసీఆర్) 96.12 శాతానికి పెరిగిందని బ్యాంక్ తెలిపింది.