హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ యూసీవో బ్యాంక్, జనవరి 6న తన 83వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా సన్‌సిటీ -బండ్లగూడ జగీర్‌లో ఆ బ్యాంక్ ఒక కొత్త బ్రాంచిని ప్రారంభించింది. ఈ బ్రాంచిని డీఎఫ్‌ఎస్ సెక్రటరీ ఎం నాగరాజు, యూసీవో బ్యాంక్ ఎండీ, సీఈవో అశ్వినికుమార్, హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ ఎన్ శ్రీకాంత్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడు తూ.. ఇది హైదరాబాద్ జోన్‌లో తమ 91వ బ్రాంచి అని, సన్‌సిటీ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. యూసీవో బ్యాంక్ సన్‌సిటీ -బండ్లగూడ జగీర్‌లో తన సేవలను విస్తరించి మరింత మంది కస్టమర్లకు సేవలందించేందుకు సిద్ధంగా ఉందని వివరించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతగా, ఈ రోజు తాము హైదర్‌షకోట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆహార పదార్థాలు, వైర్‌లెస్ మైక్ సిస్టమ్ పరికరాలను విరాళంగా అందించామని తెలిపారు. 83వ వార్షికోత్సవం సందర్భంగా వైద్య, రక్తదాన శిబిరం నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదా రులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.