calender_icon.png 30 October, 2024 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంపల్లిలో యూకో బ్యాంక్ కొత్త శాఖ

07-07-2024 01:08:30 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లి సుచిత్రా సర్కిల్ వద్ద యూకో బ్యాంక్ నూతన శాఖను ఆ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్‌కుమార్‌కాంబ్లే, హైదరాబాద్ జోనల్ మేనేజర్ ఎన్ శ్రీకాంత్‌తో కలిసి ప్రారంభించారు. ఇది హైదరాబాద్‌లోని 87వ శాఖ అని చెప్పారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, అందుబాటులో ఉన్న స్కీంల ప్రకారం తక్కువ వడ్డీకి రుణాలందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా తారా అనాథాశ్రమానికి వంట సామగ్రి, సరుకులు, బుక్స్ అందజేశారు.