calender_icon.png 6 April, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉబర్, ఓలా, రాపిడోలను తక్షణమే రద్దు చేయాలి

05-04-2025 12:38:10 AM

భద్రాద్రి ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ఆటో డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల 8వ తేదీన జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ నిర్వహించాలనిఆటో డ్రైవర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుకంచర్ల జమలయ్య, బత్తుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగూడెంలో ఆటో వర్కర్స్ యూనియన్, అన్ని కూడల్లా (అడ్డా) అధ్యక్షులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగావారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

రాపిడ్ లాం టి ప్రైవేట్ సంస్థలను రద్దు చేయాలనే డి మాండ్  ను, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, వందలాదిమంది ఆటో సోదరులతో,కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ తీయాల్సిన అవసరం ఎంతైనా  ఉందన్నారు. ఈ  భారీ ర్యాలీ 8వ తారీకు మంగళవారం ,స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీ  ఉంటుంది అని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి కృష్ణ, కొత్తగూడెంలోని అన్ని అడ్డాల అధ్యక్షులు పాల్గొన్నారు .