లండన్: బ్రిటీష్ హెవీ వెయిట్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది డిసెంబర్ ఉక్రెయిన్ బాక్సర్ ఒలెక్సాండర్ యుసిక్‌తో జరిగిన రీ మ్యాచ్‌లో టైసన్ ఫ్యూరీ ఓటమి పాలయ్యాడు. ఈ ఓటమి తన రిటైర్మెంట్‌కు బాటలు వేసినట్లు టైసన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌లో టైసన్ ఫ్యూరీ 24 నాకౌట్‌లతో పాటు 34 మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్నాడు.