యూట్యూబర్ చేతిలో ఓటమి
టెక్సాస్: దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ 19 ఏండ్ల తర్వాత ఆడిన మ్యాచ్‌లో 74-78 తేడాతో ఓడిపోయాడు. దూకుడుగా బౌట్ ను ఆరంభించినా కానీ చివరివరకూ ఆ దూ కుడును కొనసాగించలేక ఓటమిని అంగీకరించాడు. తొలి రెండు రౌండ్లు ఆధిపత్యం ప్రదర్శించిన 58 ఏండ్ల టైసన్.. తర్వాత మాత్రం 27 ఏండ్ల యూట్యూబర్ జేక్ పాల్ ముందు తలవంచక తప్పలేదు.
చెంపదెబ్బతో
బౌట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు జేక్ పాల్‌ను చెంప దెబ్బ కొట్టి ఈ పోరుపై ఆసక్తిని పెంచేశాడు. దీంతో నెట్‌ఫ్లిక్స్ నిర్వహిస్తున్న ఈ పోరుపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకున్నారు. అందుకు తగ్గట్లే ఫైట్ కూడా కొనసాగింది. ప్రతి రౌండ్ నువ్వా నేనా అన్నట్లు బౌట్ సాగింది. ఎక్కువ రౌం డ్లలో పాల్‌దే పై చేయి అయినా కానీ తేడా మాత్రం పెద్దగా లేకపోవడం గమనార్హం.
ఆ ధ్యంతం ఎంతో ఉత్సాహం, ఉత్కంఠను కలిగించిన ఈ మ్యాచ్‌లో చివరకు యువ బాక్స ర్ పాల్‌నే విజయం వరించింది. ఈ పోరు సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ కొద్ది సేపు షట్ డౌన్ అయిందని వార్తలు వచ్చినా కానీ పోరుకు మాత్రం ఎటువంటి ఆటంకం కలగలేదు.