calender_icon.png 29 September, 2024 | 12:02 PM

టైప్-1 డయాబెటిస్ రివర్స్

29-09-2024 01:50:05 AM

ప్రపంచంలోనే తొలిసారి అద్భుత చికిత్స

లండన్, సెప్టెంబర్ 28: ప్రపంచంలో నేడు అత్యంత సమస్యాత్మక ఆరోగ్య సమస్య మధుమేహం. కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మధుమేహం వచ్చిందంటే ఇతర రోగాలకు తలుపులు తెరిచినట్లేననే ప్రచారమూ ఉన్నది. కానీ, ప్రపంచంలో తొలిసారి చైనాలోని 25 ఏండ్ల ఓ మహిళకు డయాబెటిస్ పూర్తిగా తగ్గిపోయిందని వైద్యులు ప్రకటించారు.

అది కూడా టైప్-1 మధుమేహం. ఈ రకం పుట్టుకతోనే క్లోమగ్రంథి పనిచేయకపోవటంతో వస్తుంది. కొంత వయసు వచ్చిన తర్వాత ఈ గ్రంథి ఇన్సులిన్‌ను శ్రవించటం మానేస్తే వచ్చేది టైప్-2 డయాబెటిస్. చైనాలోని టియాంజిన్ నగరంలో నివసించే మహిళపై అక్కడి వైద్యులు అరుదైన ప్రయోగం చేశారు.

ఆమె కడుపు పైభాగంలో క్లోమగ్రంథి ఉండే ప్రాంతంలో బయటనుంచి పంపిన కొన్ని జీవకణాలను పెంచారు. వాటిని క్లోమం, కాలేయంలోని పంపారు. అవి ఆ గ్రంథులను ఉత్తేజితం చేశాయి. దీంతో క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. అలా ఆమెకు మధుమేహం పూర్తిగా నయమైందని వైద్యులు తెలిపారు.