నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ గ్రామ శివారులో ఘటన...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం రెడ్యా తండా సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కల్వకుర్తి పట్టణానికి చెందిన శ్రీనాథ్(20), భాను (18) ఇరువురూ ఊరుకొండ నుండి కల్వకుర్తి పట్టణానికి బైక్ పై బయలుదేరే క్రమంలో జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై రెడ్యా తండా గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి కింద పడ్డారా లేదా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా అన్న కోణంలో పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.