పెద్దపల్లి (విజయక్రాంతి): మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి రాఘవపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వసంత్ నగర్ ఎస్ఐ స్వామి కథన ప్రకారం... ఇద్దరు యువకులు మంథని నుండి పెద్దపల్లికి వస్తున్న తరుణంలో బోలోరా వాహనం ద్విచక్రవాహాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరోక యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.