calender_icon.png 23 December, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు

23-12-2024 07:53:32 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పాలిటిక్స్ ఫ్లైఓవర్ పై సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన సాయికిరణ్, వంశీ అనే యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ లో వీరిద్దరిని చికిత్స కోసం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.