calender_icon.png 19 January, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి

25-08-2024 06:33:20 PM

చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడి 

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు 25 (విజయ క్రాంతి): జిల్లాలోని బూర్గంపాడు మండలం జింకల గూడెం వద్దగల సీతారామ ప్రాజెక్టు కాలవలో పడి ఆదివారం ఇద్దరు యువకులు మృతి చెందారు. కొత్తగూడెం పట్టణానికి చెందిన జమురుద్దీన్(39), రియాజ్(20) కొత్తగూడెం నుంచి ఏపీ20హెచ్6466 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై చేపల వేటకు వెళ్లారు. జింకలగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ కాలవలో దిగారు. లోతు తెలియక మునిగిపోయి మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీసి, శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు.