19-02-2025 08:20:24 PM
వావిలాల పీర్షా చెరువులో ఘటన...
పటాన్‌చెరు: కల్లు తాగిన ఇద్దరు యువకులు సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన జిన్నారం మండలం వావిలాల ఫీర్షా చెరువులో జరిగింది. ఎస్ఐ నాగలక్ష్మి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన వల్లపు నరేశ్(26) వల్లపోలు శంకర్(22) ఇద్దరు స్నేహితులు. స్కూటీపై మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వావిలాల గ్రామ సమీపంలోని పీర్షా చెరువు వద్దకు వచ్చారు. చెరువు కట్టపై కల్లు తాగారు. అనంతరం ఇద్దరు సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగారు.
అదే సమయంలో అక్కడ బర్రెలు మేపుతున్న వ్యక్తి నీటి మునిగిపోతున్న ఇద్దరు యువకులను కాపాడే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది. స్థానికులు జిన్నారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ నాగలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. వావిలాల, జంగంపేట గ్రామాలకు చెందిన గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా బుధవారం మద్యాహ్నం ఇద్దరి యువకుల మృతదేహాలు లభించాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు.