calender_icon.png 10 January, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లైఓవర్పై నుంచి పడి ఇద్దరు యువకుల మృతి

04-08-2024 08:53:53 PM

హైదరాబాద్: అతి వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్(27), జాబ్ సెర్చింగ్‌లో ఉన్న బాలప్రసన్న(26) మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారు జామున సుమారు 4 గంటల ప్రాంతంలో మసీద్‌బండ నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై వెళ్తున్నారు.

కొత్తగూడ ఫ్లుఓవర్‌పై అతి వేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడపడంతో ఫ్లుఓవర్ గోడను ఢీకొని కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.