04-03-2025 11:39:35 PM
న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ గ్రామ శివారులో సంఘటన
సంగారెడ్డి (విజయక్రాంతి): చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరి యువకులు మృతి చెందిన సంఘటన ఇది. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ గ్రామ శివారులో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరికీ యువకులు మృతి చెందిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని లాతూర్ పట్టణానికి చెందిన వారు గంగ్వార్ గ్రామ శివారులో ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని తెలిసింది. మహారాష్ట్రలోని లాతూర్ పట్టణానికి చెందిన సంజయ్ కాంబ్లే (50), పైజల్ (17) స్నానం కోసం చెరువు వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ఫైజల్ నీటిలో మునిగిపోవడంతో రక్షించేందుకు సంజయ్ కాంబ్లీ వెళ్ళిన్నారు.
చెరువులో గుంత ఉండడంతో గుంతలో పడి ఫైజల్ మునిగిపోవడం జరిగిందన్నారు. రక్షించేందుకు వెళ్లిన సంజయ్ కాంబ్లే వీటిలో మునిగిపోయి మృతి చెందారన్నారు. వీరిని కాపాడేందుకు ఫైజల్ తండ్రి రహమతుల్లా చెరువులోకి వెళ్ళగా మునిగిపోవడంతో వెంటనే తిరిగి ఓడ్డుకు రావడం జరిగింది అన్నారు. వీటిలో మునిగిపోయిన సంజయ్ కాంబ్లీ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. ఫైజల్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాత్రి కావడంతో చెరువు వద్ద మృతదేహాన్ని గాలించేందుకు ఇబ్బందులు ఉన్నాయి. దీంతో పోలీసులు సంజయ్ కాంబ్లీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.