27-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి) : సికిం ద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మహంకాళి సీఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. బన్సీలాల్ పేటకు చెందిన ఎర్ర హర్షిత్(21), జీ దేవిప్రణయ్(19)లు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. రాత్రి డ్యూటీకి వెళ్లి బుధవారం తెల్లవారు జామున ఇంటికి వెళుతుండగా మినర్వా గ్రాండ్ హోటల్ చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో ప్రణయ్ ప్రమాద స్థలంలోనే చనిపోయాడు. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా హర్షిత్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.