రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
25-05-2026 01:45 AM
కొండాపూర్, మే 25 : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి గోటిలగుట్ట తండాకు చెందిన విక్రమ్ (27), మల్కాపూర్ గాయత్రి నగర్కు చెందిన అనిల్ (30) ఇద్దరు యువకులు పల్సర్ బ్పై సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. బైక్ను అనిల్ నడుపుతున్నట్లు సమాచారం. కొండాపూర్ మ్యూజియం సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అదుపుతప్పి వేగంగా వెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై విక్రమ్ తండ్రి కిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండాపూర్ ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపారు.






