పటాన్ చెరు,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ హుడా లేఅవుట్ వద్ద టిప్పర్ యూటర్న్ చేస్తున్న క్రమంలో వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకుల తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వం ఆసుపత్రి(Patancheru Government Hospital)కి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులు ఇంద్రారెడ్డి కాలనీ చెందిన హరీశ్(19), బన్నీ(20)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.