01-03-2025 08:44:32 PM
కొల్చారం,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు మంజీరా నది రెండవ పాయ నీటి మడుగులో మునిగి ఇద్దరూ యువకులు మృతి చెందిన సంఘటన కొల్చారం మండల పరిధిలోని ఏడుపాయల మంజీరా నదిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం... సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఇందిరానగర్ కాలనీ, ఆసిఫ్ నగర్ కు చెందిన నిన్నేకర్ కృష్ణ, మిల్కీకర్ శ్యాం కుమార్ వారి కుటుంబ సభ్యులతో మూడు రోజుల క్రితం ఏడుపాయల వన దుర్గ మాత జాతరకు వచ్చారు. తమ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఏడుపాయల ఆలయ సమీపంలోని పోతం శెట్టి పల్లి శివారు మంజీర నది రెండవ బ్రిడ్జ్ వద్ద ఎడమవైపు నాగల మంజీరా నదిలో స్నానానికి వెళ్లన కృష్ణ(18), శ్యామ్ కుమార్(21) ఈత కొట్టుచుండగా సరిగా ఉపిరి ఆగాకపోవడంతో ప్రమాదవశత్తు నీటిలో మునిగి చనిపోయారు. అక్కడే ఉన్న మృతులకు కృష్ణ అన్న అంబదాస్ నీటిలోకి వెళ్లి కాపాడే ప్రయత్నం చేసిన అప్పటికే మునిగిపోయినారు వెంటనే పక్కనే ఉన్న గజ ఈతగాల్ల తో ఇట్టి విషయం తెలుపగా బేస్త కాశీరాం మరియు బెస్త శాలయ్య లు వెంటనే నీటిలోకి వెళ్లి గాలించి మృతులను ఒడ్డుకు తీసుకొని వచ్చి చూడగా అప్పటికే ఇద్దరు మరణించినారు. నిన్నేకర్ గోపాల్ ఫిర్యాదు మేరకు ఎస్సై మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.