calender_icon.png 28 November, 2024 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంఖుస్థాపన చేసి రెండేళ్లు.. రోడ్డు నిర్మాణం ఎప్పుడో..

23-10-2024 11:24:53 AM

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలం శంభుని గూడెం టీడబ్ల్యూ రోడ్డు నుంచి రాజుతండా వయా గోప్యతండా వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేసి రెండేళ్లు గడిచింది. ఎస్ టీఎస్ డిఎఫ్ 2022-2023 గ్రాంటుతో రూ.1.60 కోట్లతో గత ప్రభుత్వ కాలంలో దాదాపు రెండు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నేటికీ పనులు ప్రారంభించక పోవడంతో రాజు తండా, గోప్యతండా ప్రజలు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో అనేక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. దీనితో  కనీసం అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఉన్నత అధికారులు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ తీసుకొని నిర్లక్ష్యం వహిస్తున్న ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని రోడ్డు త్వరగా వేయాలని గ్రామస్తులు భూక్యా రాజా నాయక్, భద్రు నాయక్, బాలు నాయక్, సోమని, జుంకీలాల్, కొర్ర రమేష్, నరేష్, రెడ్యా, సుమన్, రవి, వెంకన్నలు కోరుతున్నారు.