15-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): రెండేళ్ల బాలుడికి అరుదైన క్యాన్సర్ సోకింది. 15 ఏళ్లలోపు పిల్లలకే వచ్చే న్యూరోబ్లాస్టోమా అనే ఈ క్యాన్సర్ పది లక్షల మం ది పిల్లల్లో కేవలం 8 మందిలోనే కనిపిస్తుంది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కణతి తొలగించి, విజయం సాధించారు. ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకా లజిస్ట్ డాక్టర్ మధుదేవరశెట్టి వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ లాలాపేట్ ప్రాంతా నికి చెందిన రక్షిత్ అనే రెండేళ్ల బా లుడికి న్యూరోబ్లాస్టోమా చాలా ముదిరిన దశలో ఉంది. న్యూరోబ్లాస్టోమా అనేది నా డీ కణజాలం నుంచి అభివృద్ధి చెందే ఒక అరు దైన క్యాన్సర్. ఇది మూత్రపిండాల యొక్క నరాల కణజాలంలో ప్రారంభమవుతుంది. మెడ, ఛాతీ లేదా పెల్విస్ నరాల కణజాలాలలో కూడా ప్రారంభమవుతుంది.
రక్షిత్‌లో మాత్రం శరీరం దిగువ భాగాల నుంచి గుండెకు చెడురక్తాన్ని తీసుకెళ్లే ప్రధా న రక్తనాళంతో పాటు కుడి మూత్రపిండా న్ని కూడా ఆనుకుని ఉంది. దీంతో అతడికి శస్త్రచికిత్స చేయడం సంక్లిష్టంగా మా రింది. ఆపరేషన్ చేసేటప్పుడు కిడ్నీ తొలగించాలి వస్తుందని డాక్టర్లు భావించారు. కానీ డాక్టర్ మధు దేవరశెట్టి బృందంలోని వైద్యులంతా అత్యంత నైపుణ్యంతో కిడ్నీని తొలగించకుండానే ఆపరేషన్ చేసి, కణతిని తొలగించారు.
శస్త్రచికిత్స తర్వాత రక్షిత్ చాలా వేగంగా కోలుకున్నాడు. కిమ్స్ ఆస్పత్రిలో అన్ని విభాగాల్లోనూ అనుభవజ్ఞులైన వైద్యనిపుణులు, అత్యాధునిక సదుపాయాలు, క్రిటికల్ కేర్ నిపుణులు అందరూ ఉండటంతో ఇలాంటి సంక్లిష్టమైన కేసుల్లో చికిత్స సాధ్యమవుతోందని డాక్టర్ మధు వివరించారు.