calender_icon.png 31 October, 2024 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్

14-08-2024 11:13:45 AM

కిడ్నాపర్లను పట్టుకునే పనిలో పోలీసులు

దుబ్బవాడ: జగిత్యాల జిల్లాలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. మెట్ పల్లి పట్టణంలోని దుబ్బవాడలో నివాసముంటున్న లక్ష్మి - రాజుల రెండేళ్ల తనయుడు శివను గుర్తు తెలియని దుండగులు మోటార్ సైకిల్ పై వచ్చి అపహరించుకెళ్లారు. పిల్లలను బయటకు పంపించేందుకు తల్లిదండ్రులు  హడలిపోతున్నారు.  రెండేళ్ళ బాలుడిని అక్క అమ్ములు ఆడిపించుకుంటూ కిరాణ షాప్ కు వెళ్తుండగా, గమనించిన అగంతకులు ఆ బాలున్ని కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాచారం అదుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. సీసీ కెమెరాలో పాప అమ్ములు నుండి రెండేళ్ళ బాబును అపహరించుకుపోతున్నట్లు ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. లక్ష్మి - రాజు భార్యాభర్తలు కూలీ పని చేసుకుంటూ అప్పుడప్పుడు భిక్షాటన చేస్తారు. రెండేళ్ళ బాలుడి కిడ్నాప్ కు గురి కావడంతో ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో పాటు పిల్లల కిడ్నాప్ లతో చేస్తున్న ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు.