calender_icon.png 8 October, 2024 | 8:23 AM

విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి

08-10-2024 02:13:30 AM

మేడ్చల్, అక్టోబర్ 7: విద్యుదాఘాతంత  ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో నలుగురు గాయపడిన ఘటన మేడ్చల్ మండలం కండ్లకోయలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హిందుస్థాన్ యూనిలివర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కండ్లకోయ నుంచి శంషాబాద్‌కు షిఫ్ట్ చేస్తున్నారు.

సామగ్రిని తరలించేందుకు విష్ణు ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్ చెందిన కార్మికులతో పాటు మరోనలుగురు ఇనుప నిచ్చెనను బయటకు తీసుకొస్తుండగా మెయిన్ గేట్ వద్ద 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ కొట్టిం ది. కార్మికులను సమీపంలోని సీఎంఆర్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్సపొందు తూ గుడుబైట(26), పురో మాంఝీ (25) మరణించారు. చోటా పాశ్వాన్, కరం కుమార్, లకిందర్ కుమార్‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. 

విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్..

చేవెళ్ల: చేవెళ్ల మండలం దుద్దాగుకి చెందిన శ్రీనివాస్ (42) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. సోమవారం న్యాలట గ్రామ పరిధిలోని సుచేరి ఫామ్స్‌లో కరెంట్ పనిచేసేందుకు వెళ్లాడు. అక్కడ వెల్డింగ్ మిషన్‌కు కనెక్షన్ ఇస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. అక్కడున్నవారు శ్రీనివాస్‌ను చేవెళ్లలోని  ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిన ట్లు వైద్యులు నిర్ధారించారు.