రామగుండం (విజయక్రాంతి): రామగుండం మండలం పీకే రామయ్య కాలనీకి చెందిన దేదావత్ మారు, మాలోత్ మంజుల అనే ఇద్దరు మహిళలు బైండోవర్ ఆంక్షలు ఉల్లంఘించి నాటుసారా విక్రయించినందుకు జైలు శిక్ష విధించినట్లు ఎక్సైజ్ సీఐ మంగమ్మ తెలిపారు. గతంలో రామగుండం తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. ఇటీవల ఈ ఇద్దరు మహిళలు బైండోవర్ ఆంక్షలను ఉల్లంఘించి నాటుసారా అమ్మకాలు చేయడంతో కేసు నమోదు చేసి రామగుండం తహశీల్దార్ ఎదుట హాజరు పరిచగా లక్ష రూపాయలు జరిమానా విధించగా జరిమానా కట్టనందుకు రామగుండం తహశీల్దార్ జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఎవరైనా నాటుసారా విక్రయించినా, రవాణా చేసినా, తయారు చేసినా లక్ష రూపాయలు జరిమానా లేదా ఏడాది జైలు విధించబడుతుందనని సీఐ మంగమ్మ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.