తిరుపతి : తిరుమలకు వెళుతున్న ఇద్దరు మహిళా భక్తులు(Tirumala Devotees) తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున అంబులెన్స్ ఢీకొని మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. పీలేరు నుంచి వస్తున్న 108 అంబులెన్స్ తెల్లవారుజామున 4 గంటలకు రంగంపేట-మంగాపురం మధ్య భక్తులను ఢీ కొట్టిందని అధికారి తెలిపారు. "అంబులెన్స్(Ambulance) వెనుక నుండి ఏడుగురు భక్తులను ఢీకొట్టింది. వారిలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు" అని అధికారి మీడియాకు చెప్పారు. పోలీసులు బీఎన్ఎస్(BNS) సెక్షన్ 106 క్లాజ్ 1 కింద కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా, తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి పొగమంచు కారణంగా ఉండవచ్చని తిరుపతి పోలీసు సూపరింటెండెంట్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఆలయానికి నడకదారిన వెళ్లేందుకు ఇష్టపడే భక్తులు రోడ్డు పక్కనే నడవాలని, ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.