న్యూఢిల్లీ, నవంబర్ 1: ఈ ఏడాది అక్టోబర్ నెలలో దేశంలో ద్విచక్ర వాహన విక్రయాలు జోరుగా సాగాయి. తమ మొత్తం అమ్మకాలు 18 శాతం పెరిగి 6,79,091 యూనిట్లకు చేరాయని దేశంలో అతిపెద్ద టూవీలర్స్ కంపెనీ అయిన హీరో మోటో కార్ప్ శుక్రవారం వెల్లడించింది. దేశీయంగా డీలర్లకు సరఫరా చేసిన డిస్పాట్‌లు 5,59,766 యూనిట్ల నుంచి 6,57,403 యూనిట్లకు పెరిగాయని, ఎగుమతులు 15,164 యూనిట్ల నుంచి 21,688 యూనిట్లకు పెరిగాయని హీరో మోటో తెలిపింది. ఈ అక్టోబర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హోల్‌సేల్ విక్రయాలు 26 శాతం వృద్ధిచెంది 1,10,886 యూనిట్లకు పెరిగాయి. టీవీఎస్ మోటార్ అమ్మకాలు 13 శాతం పెరిగి 3,90,589 యూనిట్లకు చేరాయి.