calender_icon.png 15 January, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు..

15-01-2025 08:32:51 PM

9 వాహనాలు స్వాధీనం...

నిజామాబాద్ (విజయక్రాంతి): తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తున్ని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ రఘుపతి తెలిపారు. దొంగతనాలు చేసి జైలుకి వెళ్లినా.. తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్ళీ హైదరాబాద్, నవీపేట్, బోధన్, నిజామాబాద్ లలో మోటార్ సైకిల్స్ దొంగతనాలు చేస్తున్న జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కు చెందిన షేక్ ఆదిల్ అనే వ్యక్తిని బుధవారం నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకొని విచారించగా అతను చేసిన దొంగతనాలు ఒప్పుకొని, దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ ని చూపించగా, (9) బైక్ లను రికవరీ చేసి నేరస్తున్ని కోర్టులో హాజరు పరిచినట్లు వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ రఘుపతి తెలిపారు.