25-02-2025 10:11:12 PM
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలోని శ్రీరామ్ నగర్ కాలనీ కి చెందిన గరిగె రవీందర్ (46), మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని సంతోష్ థియేటర్ పక్కన ఉదయం 10 గంటల ప్రాంతంలో తన స్కూటీని పార్క్ చేసి వెళ్ళగా, అది గమనించిన గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాదితుడు తన వాహనం చోరీకి గురైందన్న విషయాన్ని గమనించి స్థానిక ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని దొంగిలిస్తున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. కాగా భాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.