calender_icon.png 15 January, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే యూపీఐతో ఇద్దరు యూజర్లు

09-08-2024 01:59:29 AM

డెలిగేటెడ్ పేమెంట్స్ వ్యవస్థను ప్రకటించిన ఆర్బీఐ

డిజిటల్ చెల్లింపుల్ని మరింత విస్త్రతపరిచే దిశగా రిజర్వ్‌బ్యాంక్ కొత్త యూపీఐ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐలో ‘డెలిగేటెడ్ పేమెంట్స్’ సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నామని, దీని ద్వారా ఒక వ్యక్తి (ప్రైమరీ యూజర్) మరొకరికి (సెకండరీ యూజర్) ఒక పరిమితివరకూ యూపీఐ లావాదేవీలు నిర్వహించే అనుమతిని ఇవ్వవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అలా అనుమతి పొందే వ్యక్తికి యూపీఐతో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. ప్రైమరీ యూజర్ ఖాతా నుంచే యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల్లో మరొకరికి ఈ అనుమతిని ఇచ్చుకోవచ్చు. అలాగే యూపీఐ నుంచి పన్నుల చెల్లింపు పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు దాస్ తెలిపారు.