15-03-2025 12:08:11 AM
వ్యక్తి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
అశ్వారావుపేట, మార్చి 14 (విజయ క్రాంతి) : ఎదురుదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదం లో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటన అశ్వారావుపేట మండలం తిరుములకుంట గ్రామ సమీపంలో శుక్రవారం సాయంకాలం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
తిరుమల కుంట గ్రామ సమీపంలో నీ ఆంజనేయ స్వామి గుడి వద్ద రెండు బైకులు ఢీ కొన్నాయని. ఆంధ్రలోని జంగారెడ్డిగూడెం మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన కోర్సా సత్తిబాబు(40) అక్కడిక్కడే మృతి చెందాడని, మరో వ్యక్తి మాదేష్ శ్రీను అని స్థానికులు తెలిపారు. మరో వాహనం పై ఉన్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.ప్రమాద విషయం తెలవగానే అశ్వారావుపేట ఎస్ ఐ యాయతి రాజు సంఘటన స్థలానికి చేరుకొని , క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.