calender_icon.png 25 March, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్లను తరలిస్తున్న రెండు ట్రాలీలు పట్టివేత

23-03-2025 01:45:57 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఎలాంటి అనుమతి పేపర్లు లేకుండా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ప్రాంతాల్లో ఎడ్లను కొనుగోలు చేసి తరలిస్తున్న రెండు ఆటో ట్రాలీలను శనివారం రాత్రి సోమగూడెం ప్రాంతంలో పట్టుకున్నట్లు కాసిపేట ఎస్ఐ వొల్లాల ప్రవీణ్ కుమార్ తెలిపారు. వాంకిడి మండలానికి చెందిన షేక్ ఇషుభ్, షేక్ ఆసిమ్ లు పరిమితికి మించి ఆటో ట్రాలీలలో 8 ఎడ్లను అతి క్రూరంగా ఎక్కించి రాజారాం పల్లి మార్కెట్ లో అమ్మడానికి తీసుకెళ్తుండగా సోమగుణం మధుర జంక్షన్ వద్ద పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. పశు వైద్యాధికారులతో పశువులకు వైద్య పరీక్ష నిర్వహించి పట్టుబడ్డ 8 ఎడ్లను సుల్తానాబాద్ లోని గోశాలకు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ చెప్పారు.