calender_icon.png 20 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత

20-04-2025 08:54:12 PM

వేములపల్లి (విజయక్రాంతి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశం(SI Venkatesham) ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని రావులపెంట గ్రామ శివారులో గల మూసి వాగులో రావులపెంట గ్రామానికి చెందిన బయ్య సైదులు తండ్రి ఆచార్య, శీలం సైదులు తండ్రి నాగయ్యలు తమ ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను లోడు చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నామన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను స్టేషన్ కి తరలించి ట్రాక్టర్లపై ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.