calender_icon.png 28 September, 2024 | 4:46 AM

రాష్ట్రానికి రెండు పర్యాటక అవార్డులు

28-09-2024 03:02:51 AM

  1. క్రాఫ్ట్ క్యాటగిరీలో ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రంగా నిర్మల్ ఎంపిక
  2. ఆధ్యాత్మిక విభాగంలో సోమశిలకు గుర్తింపు
  3. టూరిజం డే సందర్భంగా పురస్కారాలను అందజేసిన ఉపరాష్ట్రపతి
  4. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కార్యక్రమం

హైదరాబాద్/నిర్మల్, సెప్టెంబర్27 (విజయక్రాంతి): నిర్మల్‌కు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన కొయ్యబొమ్మలు రూపొందించే ఈ ప్రాంతానికి క్రాఫ్ట్ క్యాటగిరీలో ఉత్తమ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గుర్తింపు ఇచ్చిం ది.

కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఉత్తమ పర్యాటక గ్రామాలు పోటీలో నిర్మల్‌తోపాటు నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల కూడా చోటుసంపాదించిం ది. మొత్తం ఎనిమిది క్యాటగిరీల్లో నిర్వహించిన పోటీ నిర్వహించగా.. స్పిరిచ్యువల్ - వెల్నెస్ కేటగిరీలో సోమశిల, క్రాఫ్ట్స్ విభాగంలో నిర్మల్‌కు కేంద్రం అవార్డులను ప్రకటించింది.

శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్ష తన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ముఖ్య అతిథిగా హాజరై అవా ర్డులను అందజేశారు. అవార్డులను నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ పెంట య్య, సోమశిల జిల్లా పర్యాటక శాఖ అధికారి టీ నర్సింహా అందుకున్నారు. 

ఉత్తమ పర్యాటక గ్రామంగా దేవమాలి

రాజస్థాన్‌లోని ఆజ్మీర్ సమీపంలోని దేవ్‌మాలీ భారత్‌లో ఉత్తమ పర్యాటక గ్రామం గా ఎంపికైంది. దేవ్‌మాలీ ఓ ప్రత్యేకమైన గ్రామం. గ్రామంలోని 1,875 ఎకరాల భూమిని స్థానిక దైవం దేవనారాయణ్ స్వామికి అంకితం చేశారు. వీరివద్ద భూపత్రాలు ఉండవు. గ్రామస్థులకు శాశ్వత నివా సాలు కూడా లేవు.

గ్రామమంతా గడ్డితో కప్పిన మట్టి ఇళ్లే కనిపిస్తాయి. ఇళ్లకు తాళా లు సైతం వేయరు. గ్రామంలో మాంసాహా రం, మద్యపానం నిషేధం. వంటకు కిరోసిన్, వేప కలప వాడరు. ఈ ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలు, స్థానిక సంస్కృతిని రక్షించ డంలో స్థానికుల పాత్ర ఆధారంగా ఈ అవార్డుకు దేవమాలీ ఎంపికైంది. కాగా, ఏపీలోని అహోబిలం కూడా ఆధ్యాత్మిక విభాగంలో ఉత్తమ గ్రామంగా ఎంపికైంది. 

జాతీయ గుర్తింపు అభినందనీయం

సోమశిల, నిర్మల్‌కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా ఎంపిక కావడం హర్షణీయం. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నిర్మల్  కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్‌కు, తన సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్‌లోని సోమశిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయం.

నిర్మల్, సోమశిల గ్రామస్థులు, కళాకారులకు, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టూరిస్ట్ డెస్టినేషన్‌గా తెలంగాణ పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతాం. రానున్న రోజుల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తాం. తెలంగాణ కళలకు అనేక ప్రోత్సాహాకాలు ఇస్తున్నాం. 

 జూపల్లి కృష్ణారావు, 

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి