calender_icon.png 6 October, 2024 | 1:41 AM

జీఐసీ డిజిన్వెస్ట్‌మెంట్‌కు రూ.2,300 కోట్ల బిడ్స్

05-09-2024 12:00:00 AM

సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 108 శాతం సబ్‌స్క్రిప్షన్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ)లో 6.7 శాతం వాటాను మార్కెట్లో విక్రయించడానికి బుధవారం ప్రారంభించిన ఆఫర్ ఫర్ సేల్‌కు (ఓఎఫ్‌ఎస్) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2,300 కోట్ల విలువైన బిడ్స్‌ను దాఖలు చేశారు. సంస్థలకు కేటాయించిన 5.35 కోట్ల షేర్లకుగాను 5.81 షేర్లకు (108 శాతం) బిడ్స్ వచ్చాయి.  ఒక్కో షేరుకు రూ.395 చొప్పున ఫ్లోర్ ధరను ప్రభుత్వం నిర్ణయించింది.

రిటైల్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ గురువారం ప్రారంభమవుతుంది. ఫ్లోర్ ధర రూ.395 ప్రకారం 11.90 కోట్ల షేర్ల (6.78 శాతం) విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 4,700 కోట్లు సమకూరు తుంది. బుధవారం బీఎస్‌ఈలో జీఐసీ షేరు ధర 5 శాతంపైగా క్షీణించి రూ.397 వద్ద ముగిసింది. జీఐసీలో ప్రస్తుతం కేంద్రానికి 85.78 శాతం వాటా ఉన్నది. 2017 అక్టోబర్‌లో జారీఅయిన జీఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం రూ. 9,685 కోట్లు సమీకరించింది.