calender_icon.png 4 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు వేల స్కూళ్లల్లో బాలికలకు టాయిలెట్లు లేవు!

01-01-2025 01:48:57 AM

  1. రాష్ట్రంలో జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లు 2097
  2. సింగిల్ టీచర్ ఉన్న బడులు 5,985 
  3. 2023-24 యూడైస్ రిపోర్టులో వెల్లడి

* రాష్ట్రంలో మొత్తం జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలు 2097 ఉన్నాయి. ఇందు లో దాదాపు అన్నీ ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు 5,985 ఉన్నా యి. రాష్ట్రంలో మొత్తం 42,901 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో  72,93,644 మంది విద్యార్థుల కు 3,41,460 మంది టీచర్లు ఉన్నారు. 

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): స్కూల్‌కు వెళ్లే బాలికలకు, ఆ స్కూల్‌లో మరుగుదొడ్లు లేకపోతే ఎంత కష్టం.. రాష్ట్రంలో దాదాపు రెండువేల స్కూళ్లల్లో బాలికలు ఇదే కష్టం అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 29,383 ఉండగా, వీటిలో 2017 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లులేవు.

మిగిలిన 2277 పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి వినియోగం లో లేవు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి న 2023-24 యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యూకేషన్) రిపోర్టు ఈ విషయం తెలిపింది. బాలికలకే కాదు బాలురకు కూడా మరుగుదొడ్లు సరిగా లేవని నివేదికలో పేర్కొ ంది.

బాయ్స్, కోఎడ్యుకేషన్ పాఠశాలలు రాష్ట్రంలో 28,689 ఉండగా 4823 స్కూళ్లలో బాలురకు మరుగుదొడ్లు లేవు. మిగిలిన 2618 స్కూళ్లలో మరుగుదొడ్లు వినియోగంలో లేవు. విద్యుత్ సౌకర్యంలేని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో 1977 ఉండగా, విద్యుత్ వినియోగంలో లేని పాఠశాలలు 1286 ఉన్నాయి. మంచినీటి సౌకర్యంలేని పాఠశాలలు 1037 ఉండగా, వినియోగంలో లేని పాఠశాలలు 1566 ఉన్నాయి.

జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లు..

రాష్ట్రంలో మొత్తం జీరో ఎన్‌రోల్‌మెం ట్ ఉన్న పాఠశాలలు 2097 ఉన్నాయి. ఇందులో దాదాపు అన్నీ ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు 5,985 ఉన్నాయి. రాష్ట్రం లో మొత్తం 42,901 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో  72,93,644 మంది విద్యార్థులకు 3,41,460 మంది టీచర్లు ఉన్నా రు. 

ఈ రిపోర్టులో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమగ్ర వివరా లను ప్రతీ ఏటా పొందుపరుస్తారు. ఈక్రమంలోనే 2023-24 విద్యాసంవత్స రానికి సంబంధించిన యూడైస్ రిపోర్టును కేంద్ర విద్యాశాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు రేషియో మొత్తంగా 21గా ఉంది.

ఒక్కో స్కూల్‌కు సగటున 8 మంది టీచర్లు, ఒక్కో పాఠశాలల్లో 170 మంది విద్యార్థులు సగటు న రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు. జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లలో దేశవ్యాప్తంగా తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 2167 పాఠశాలలతో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 906, మధ్యప్రదేశ్‌లో 1211 జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లున్నాయి.

సింగి ల్ టీచర్ ఉన్న స్కూళ్లు అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 13,198 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 12,611, ఝార్ఖండ్‌లో 8353, ఉత్తరప్రదేశ్‌లో 8866, మహారాష్ట్రలో 8196, కర్ణాటకలో 7821, వెస్ట్ బెంగాల్‌లో 6366, తెలంగాణ లో 5985 స్కూళ్లున్నాయి. 2023-24 యూడైస్ లెక్కల ప్రకారం విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రైమరీ స్కూళ్లలో 19:1గా, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 12:1, సెకండరీ స్కూళ్లలో 9:1, హయ్యర్ సెకండరీ స్కూళ్లలో 25:1 చొప్పున ఉంది.