calender_icon.png 5 March, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరు కేసులలో ఇద్దరి దొంగల రిమాండ్

04-03-2025 11:21:52 PM

పెద్ద అంబర్​పేట్​ ఓఆర్​ఆర్​ వద్ద వాహనాల తనిఖీలు.. ​

గూగుల్ మ్యాప్​లో దేవాలయాలను అన్వేషణ..

పిగ్లీపూర్​ శ్రీ అభయ ఆంజనేయస్వామి చోరీ కేసును ఛేదించి పోలీసులు..

అబ్దుల్లాపూర్​మెట్​: వేర్వేరు కేసులలో ఇద్దరు దొంగలను అబ్దుల్లాపూర్​ మెట్​ పోలీసులు మంగళవారం రిమాండ్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం 5:30 సమయంలో అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పైన బ్యాగ్ పట్టుకొని అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు చోరీ కేసులలో నిందితులుగా ఉన్నట్లు ఒప్పుకున్నారు. వారి బ్యాగ్ లో బిస్కెట్స్ రూపంలో వెండి ఉండటంతో పోలీసులు వారిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవటంతో వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి విచారించగా... మేడ్చల్​ చెందిన మహ్మద్​ ఇంతయజ్​ షరీఫ్​ (39)తండ్రి సాదక్​ షరీఫ్​ పెయింటర్​గా పనిచేస్తుంటాడు.

మరొక్కరు మెదక్​ జిల్లా, శివంపేట మండలం, నవాబ్​పేట గ్రామానికి చెందిన రంగావేణు (33) తండ్రి వెంకటేష్​ ఎలక్ట్రీయేన్​ వర్కర్​గా పనిచేస్తుంటాడు. వీరిద్దరు ఒకే గ్రామానికి చెందిన వ్యక్తలు. చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడానికి దేవాలయాలలో దొంగతనాలు చేయటానికి నిర్ణయించుకున్నారు. గూగుల్ మ్యాప్ సహాయంతో గ్రామ శివారులలో ఉండే  దేవాలయాలను ఎంచుకొని, గూగుల్ లో అప్ లోడ్ చేసిన ఫొటోలు, అక్కడ విగ్రహాలకు అలకరించిన ఆభరణాలు ఫొటోలు చూసి ఇద్దరు కలిసి రాత్రి సమయాలలో వచ్చి గుడి తాళాలు పగలకొట్టి గుడిలో ఉండే  ఆభరణాలు దొంగతనం చేస్తుంటారు. 

అదే విధంగానే  అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధి  పిగ్లీ పూర్ గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో  ఈ వ్యక్తులే దొంగతనం చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. ఇవే కాకుండా హైదరాబాద్​ శివారు ప్రాంతాలలో పలు చోట్ల చోరీలు చేసి.. వెండి ఆభరణాలను ముక్కలుగా కట్​ చేసి కరిగించి.. బిస్కెట్​ మార్చి వాటిని విజయవాడ తరలించే క్రమంలో అదుపులోకి తీసుకుని రిమాండ్​ పంపినట్లు అబ్దుల్లాపూర్​మెట్​ ఇన్​స్పెక్టర్​ అంజిరెడ్డి తెలిపారు.