బైంసా (విజయక్రాంతి): బైంసా పట్టణ శివారులోని బ్రోకర్ జాతీయత రహదారి పక్కన ఉన్న నాగదేవత ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ తో గురువారం వివరాలను వెల్లడించారు. నూతన సంవత్సరం విందుకోసం డబ్బులు లేవన్న కారణంతో బైంసా మండలం చెందిన విశాల్, సంఘ రతన్ ఇద్దరు మిత్రులు కలిసి డిసెంబర్ 31న బైసా శివారులోని నాగదేవత ఆలయంలో తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అందులోని హుండీని పగలగొట్టి కానుకలను హాజరడమే కాకుండా గుడి గంటలను సైతం అపహరించారు. ఈ సంఘటనకు నిరసనగా భైంసా పట్టణం బుధవారం నాడు హిందూ వాహిని పిలుపు మేరకు బంద్ పాటించిన విషయం తెలిసింది. ఈ మేరకు కేసు తీవ్రత దృశ్య పోలీసులు తీవ్రంగా పరిగణించి 48 గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. వారి నుంచి గంటలను స్వాధీనం చేసుకుని దొంగలను రిమాండ్ పంపమన్నారు.