భైంసా, జనవరి 2: కొత్త సంవత్సరం రోజు జల్సాలు చేసేందుకు డబ్బుల కోసం ఆలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగల ను భైంసా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ జానకీ షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమా ర్ గురువారం వివరాలు వెల్లడించారు. భైంసా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన విశాల్, సంఘ రతన్ ఇద్దరు స్నేహితులు.
జనవరి 1న విందు కోసం డబ్బులు లేకపోవడంతో.. భైంసా శివారులోని బోఖర్ జాతీయ రహదారి 61 పక్కన ఉన్న నాగదేవత ఆలయంలో సోమవారం వేకువజామున హుండీని ధ్వంసం చేసి, అందులోని కానుకలతో పాటు గుడి గంటలను అపహరించారు.
విష యం తెలుసుకున్న పట్టణ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును తీవ్రంగా పరగ ణించిన భైంసా సీఐ గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి సేకరించిన ఆధారాల ఆధారంగా దొం గలను పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్ పంపినట్లు పేర్కొన్నారు.