calender_icon.png 16 January, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు దొంగల అరెస్ట్

07-07-2024 12:05:00 AM

రూ. 27 లక్షల విలువైన 300 గ్రాముల ఆభరణాలు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి) : వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలతో పాటు వాటిని కొనుగోలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం టోలీచౌకి బృందావన్ కాలనీ మోడరన్ కేఫ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టిన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు అనుమానితులు పారిపోవడానికి ప్రయత్నించారు. గమనించిన ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ జనార్ధన్‌లు వెంబడించి వారిని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన పద్ధతిలో విచారించగా, పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 10కి పైగా చోరీలకు పాల్పడినట్లు, నిందితులపై గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆసీఫ్‌నగర్‌కు చెందిన సయ్యద్ అలీ హుజైఫా (20), మహమ్మద్ అజ్మల్ షరీఫ్ (19), కొనుగోలుదారు బహదుర్‌పురకు చెందిన మహ్మద్ అబిద్ బియాబానీ(19)లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 27 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.