calender_icon.png 11 January, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతనవేడుకల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్

02-01-2025 02:54:23 AM

ఎస్సార్‌నగర్‌లో 3 కిలోల గంజాయి పట్టివేత 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడకల్లో భాగంగా పబ్బులు, బార్లు, ఇతర ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ 40 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం తెల్లవారుజాము 2 గంటల దాకా దాడులను నిర్వహించగా, రెండు చోట్ల 626 గ్రాములు గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఒక పబ్బులో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ తేలింది. ఈ సందర్భంగా 4 కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, ఎస్సార్ నగర్ పరిధిలో 3.370 కిలోల గంజాయిని పట్టుకున్న అధికారులు కేసును నమోదు చేశారు.