10-03-2025 08:59:32 PM
కంగ్టి: కంగ్టిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మొక్కలను నీళ్లు పోయలేనందుకు 8 మంది విద్యార్థినులకు కొట్టిన ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేస్తూ ఇతరులు జారీ చేశారు. కంగ్టి కేజీబీవీలో గణితం సీఆర్టీలు కె సురేఖ, ఎన్ రేణుకలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులో తెలిపారు. విద్యార్థులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.