calender_icon.png 22 January, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిడికి రెండడుగుల దూరంలో

21-09-2024 12:00:00 AM

45వ చెస్ ఒలింపియాడ్

బుడాపెస్ట్ (హంగేరి):  ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భారత గ్రాండ్ మాస్టర్లు సత్తా చాటుతున్నారు. పురుషుల ఓపెన్ కేటగిరీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆడిన 8 రౌండ్లలోనూ విజయాలు సాధించిన భారత్ 16 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో కొనసా గుతోంది. భారత్ తరఫున బరిలోకి దిగిన అర్జున్ ఇరిగేసి, గుకేశ్, ప్రజ్ఞానంద, హరిక్రిష్ణ, విదిత్ గుజరాతీలతో కూడిన బృందం స్వర్ణం సాధించేందకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఇక మహిళల విభాగంలోనూ హారిక, వైశాలీ, దివ్య, తానియా, వంతికలతో కూడిన భారత బృందం ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి ఏడు విజయాలతో 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 9వ రౌండ్‌లో గుకేశ్, ప్రజ్ఞా నంద, అర్జున్, విదిత్ గుజరాతీ బృందం ఉజ్బెకిస్థాన్‌తో.. మహిళల బృందం వైశాలీ, తానియా, దివ్య, వంతిక అమెరికా  జట్టుతో తలపడ్డారు. కాగా విదిత్, తానియా, గుకేశ్ గేమ్‌ను డ్రా చేసుకున్నారు.