calender_icon.png 11 February, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో ఇద్దరికి తీవ్ర అస్వస్థత

10-02-2025 01:39:44 AM

రాజంపేట, ఫిబ్రవరి 9 : రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది గ్రామానికి చెందిన ఒకరి రైస్ మిల్లులో కరెంటు రావడం లేదని ట్రాన్స్ఫార్మర్ వద్ద కట్ పాయింట్ పెట్టాలని బీరయ్యను బతిమిలాడాడు, బీరయ్య మరో వ్యక్తి కలిసి వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సబ్ స్టేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఒకరికి సమాచారం అందించారు.

అతని సబ్ స్టేషన్‌కు సమాచారం అందజేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు . అయితే విద్యుత్ ఆపరేటర్లు నిర్లక్ష్యంతో సిద్దాపూర్ లైన్ వేయాల్సింది పోయి, కొండాపూర్ లైన్ వేయడంతో విద్యుత్ షాక్ తగిలి బీరయ్య మరొకరు అక్కడికక్కడే కింద పడిపోయారు.

గమనించిన స్థానికులు మళ్లీ సబ్ స్టేషన్ కి  సమాచారం ఇచ్చి విద్యుత్తును నిలిపివేశారు. గాయపడ్డ వారిని కామారెడ్డి లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులకు వివరణ కోరగా తమకు ఎలాంటి సంబంధం లేదని ..ఏం జరిగింది.. ఎలా జరిగిందనేది ..వివరాలు తెలుసుకొని చెప్తామని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.