calender_icon.png 12 February, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష

12-02-2025 12:00:00 AM

నిజామాబాద్ ఫిబ్రవరి 11: (విజయ క్రాంతి): మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో ఇద్దరికీ జైలు శిక్ష మరో 24 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 26 మంది పట్టుబడుగా ఏసీపీ నారాయణ ఆదేశాల మేరకు వారిని కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట ఆధారపరిచినట్టు ఆయన తెలిపారు. నిందితులపై ఆరోపణ పరిశీలించిన మెజిస్ట్రేట్ ఇద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష 24 మందికి 36వేల రూపాయల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.