calender_icon.png 8 October, 2024 | 5:09 PM

అక్రమ ఆయుధాల కేసులో ఇద్దరికి శిక్ష

08-10-2024 12:45:34 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): అక్రమంగా ఆయుధా లు కలిగి ఉండటమే కాకుండా, బెదిరింపులకు గురిచేసి నగదు వసూళ్లకు పాల్పడిన ఇద్దరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భువనగిరి అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. 2011 సంవత్సరంలో ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడినందుకు ఖమ్మం జిల్లా కొత్త పాల్వంచ వెంగళరావునగర్‌కు చెందిన వనపాకుల రాంబాబు, వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నంకు చెందిన పిట్టల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు భువనగిరి అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి  సోమవారం వాదనలు విని ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమా న విధిస్తూ తీర్పు వెలువరించారు.