మణుగూరు, నవంబర్ 3: భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకొంది. మణుగూరులో గల గ్రీన్ మిషన్ ఉన్నత పాఠశాలలో సర్వీస్ వైరు తగిలి ఇద్దరు సెక్యూరిటీగార్డులు మృతిచెందారు. గ్రీన్ మిషన్ ఉన్నత పాఠశాలలో మణుగూరులోని శివలింగాపుం కాళీమాత ఏరియాకు చెందిన ఉపేందర్(48), రత్నం (57) సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నారు. ఆదివారం పాఠశాల గోడలపై ఉన్న జెండాలను తొలగిస్తుండగా విద్యుత్ సర్వీస్ వైరు తగిలి ఇద్దరు అక్కడిక్కక డే మృతి చెందారు. మణుగూరు డీఎ స్పీ రవీందర్‌రెడ్డి, సీఐ సతీష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.