calender_icon.png 8 November, 2024 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి

03-11-2024 09:20:54 PM

మణుగూరు,(విజయక్రాంతి): విద్యుత్ షాక్ తో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మణుగూరు మండలంలోని గ్రీస్ మిషన్ హై స్కూల్లో ఉపేందర్, రత్నం అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ గార్డ్లుగా పని చేస్తున్నారు. ఆదివారం స్కూల్లో డ్యూటీ చేస్తుండగా స్కూల్ గోడల పై ఉన్న జెండాలను తొలగిస్తున్నారు.అయితే గోడల పై ఉన్న జెండాలు తీసే క్రమంలో సర్వీస్ వైర్ తగిలి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తులు స్థానిక మున్సిపాలిటీలోని శివలింగాపురం, కాళీమాత ఏరియాకు చెందిన ఉపేందర్, రత్నంగా గుర్తించారు. విషయం తెలుసుకున్న సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ సతీష్ కుమార్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల వివరాలను స్కూల్ యాజమాన్యం, విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.